ప్రశ్న ఆయుధం న్యూస్ సెప్టెంబర్ 23 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం కొంతాన్ పల్లి గ్రామంలో తూప్రాన్ అంబేద్కర్ యూత్ సభ్యులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇటీవల గ్రామంలోని అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేడ్కర్ యూత్ సభ్యులు కౌన్సిలర్ మామిడి వెంకటేష్ ఆధ్వర్యంలో తరలివచ్చిన దళిత సంఘాలు అంబేడ్కర్ విగ్రహం ముందు ఆందోళన చేపట్టారు. విగ్రహం ధ్వంసం చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.