సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని నిరసన
ప్రశ్న ఆయుధం న్యూస్, ఆగస్టు 28, కామారెడ్డి :
సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సంఘం ప్రతినిధి సంపత్ కుమార్ మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి అమలు చేయాలని డిమాండ్ చేశారు . చాలీచాలని జీతాలతో ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్నామని, ఇప్పటికైనా ఉద్యోగ భద్రతతో పాటు క్రమబద్ధీకరించాలని ఆయన తెలిపారు.