*సంపన్న రైతు దేశానికి గర్వకారణం*
పంట సాగులో రైతులు మెలకువలు తెలుసుకోవాలి
*వ్యవసాయ సహాయ సంచాలకులు సునీత*
*ఇల్లందకుంట జూన్ 11 ప్రశ్న ఆయుధం*
ప్రభుత్వం తీసుకువచ్చిన వికాసిత్ కృషి సంకల్పం”14 వ రోజు వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ శిక్షణా కార్యక్రమం లో భాగంగా ఇల్లందకుంట, మల్యాల, లక్ష్మాజిపల్లి గ్రామాలలో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సంపన్న రైతు దేశానికి గర్వ కారణం అనే ఉద్దేశ్యం తో వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ అనే కార్యక్రమంను మే 29 నుండి ప్రారంభించి జూన్ 12 వరకు ముగియానున్నది ఈ కార్యక్రమం 15 రోజులు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో వ్యవసాయం వ్యవసాయ అనుబంధ రంగాలలో నూతన సాంకేతిక పరిజ్ఞానం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల గురించి రైతులకు నేరుగా శాస్త్రవేత్తలు అవగాహన కల్పించడం జరుగుతుందని బుధవారం రోజున కృషి విజ్ఞానం కేంద్రం జమ్మికుంట వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఇల్లందకుంట లక్ష్మాజిపల్లి మల్యాల గ్రామాలలో రైతులతో శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని వ్యవసాయ అధికారి సూర్యనారాయణ తెలిపారు హుజురాబాద్ వ్యవసాయ సహాయ సంచాలకులు సునీత హాజరై మాట్లాడుతూ రైతులు నూతన సాంకేతికతను ఉపయోగించుకొని పంట సాగులో మెలకువలను రైతు సాగులో ఎదురవుతున్న సమస్యల తొలగింపునకు నూతన సాంకేతిక పరిజ్ఞానం గురించి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు ప్రతి రైతు సాగులోని మెలకువలను తెలుసుకొని అధిక దిగుబడిని పొందాలని తక్కువ పెట్టుబడితో ఎక్కువ పంట దిగుబడి వచ్చే వంగడాలను పెంచుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో కేవికే నుండి జె.విజయ్, సేద్య విభాగ శాస్త్రవేత్త & వ్యవసాయ అధికారి సూర్యనారాయణ వ్యవసాయ విస్తరణ అధికారులు అధికారులు సంపత్ , ప్రవళిక తదితరులు పాల్గొన్నారు