రంగారెడ్డి జిల్లాకు గర్వకారణం – పుష్ప టీచర్‌కు నేషనల్ ఎక్సలెన్స్ టీచర్ అవార్డు
రాజేంద్రనగర్ శారద ఎడ్యుకేషన్ సొసైటీకి చెందిన పుష్పకు జాతీయ స్థాయి ఉపాధ్యాయ అవార్డు
బిర్లా ప్లానిటోరియం వేదికగా ఘనంగా జరిగిన సత్కారం
చీఫ్ గెస్ట్ ఇటికల పురుషోత్తం, ఎమ్మెల్సీ కొమురయ్య, చైర్మన్ పట్నం మనోహర్ చేతుల మీదుగా అవార్డు
విద్యార్థుల గుండెల్లో గురువు కాదు, స్నేహితురాలిగా స్థానం సంపాదించిన పుష్ప
“విద్యార్థులు నా గురించి చెప్పిన మాటలే నాకు నిజమైన అవార్డు” – పుష్ప స్పందన
ప్రశ్న ఆయుధం రాజేంద్రనగర్, సెప్టెంబర్ 25:
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ శారద ఎడ్యుకేషన్ సొసైటీకి చెందిన ఉపాధ్యాయురాలు పుష్ప ప్రతిష్టాత్మకమైన నేషనల్ ఎక్సలెన్స్ టీచర్ అవార్డు అందుకున్నారు. హైదరాబాద్‌లోని బిర్లా ప్లానిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఆమెకు ఈ గౌరవం దక్కింది.
వైస్ చైర్మన్ ఇటికల పురుషోత్తం, ఎమ్మెల్సీ కొమురయ్య, శారద ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ పట్నం మనోహర్ ప్రత్యేక అతిథులుగా హాజరై పుష్ప చేతుల మీదుగా అవార్డు ప్రదానం చేశారు.
విద్యార్థుల సమస్యలను దగ్గరుండి విని పరిష్కరించే, వారికి ఒక కుటుంబ సభ్యురాలిలా దగ్గరగా ఉంటూ, బోధనతో పాటు మానసిక బలాన్నిచ్చే ఉపాధ్యాయురాలిగా పుష్ప ప్రత్యేక గుర్తింపు పొందారు. “పుష్ప అంటే మాకు టీచర్ కాదు, స్నేహితురాలు” అని విద్యార్థులు పలు సందర్భాల్లో భావోద్వేగంతో చెబుతుంటారు.
“ఈ అవార్డు అందుకోవడం గర్వకారణం. కానీ నా గురించి విద్యార్థులు చెప్పిన మాటలే నాకు అసలైన గౌరవం” అని పుష్ప ఆనందం వ్యక్తం చేశారు.