ముంపు బాధిత గ్రామాలను కాపాడండి మహాప్రభో
ముంపు బాధిత గ్రామాలకు శాశ్వత పరిష్కారం చూపండి
ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి జూలై 23
తెలంగాణలో గోదావరి పరివాహక ప్రాంతంలో లోతట్టు ప్రాంత గ్రామాలు (బూర్గంపహాడ్ , నాగినేని ప్రోలు రెడ్డిపాలెం, గొమ్మూరు, సారపాక , మోతే , ఇరవైండి )తదితర గ్రామాలకు కు శాశ్వత పరిష్కారం కోరుతూ రాజకీయ అఖిలపక్షం ఆధ్వర్యంలో బూర్గంపహాడ్ మండల కేంద్రం అంబేద్కర్ సెంటర్ నందు ముంపు ప్రాంతాలను కాపాడండి, శాశ్వత పరిష్కారం చూపించండి అంటూ నినదిస్తూ ధర్నా నిర్వహించి నిరసన తెలియజేశారు తదుప తహసిల్దారుకి వినతి పత్రం అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో భద్రాద్రి పరిరక్షణ సమితి అధ్యక్షులు బూసిరెడ్డి శంకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్న ముంపు బాధిత గ్రామ ప్రజల బతుకులు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు . కరకట్టల నిర్మాణం లేదా పోలవరం ప్యాకేజీ తో బాధిత గ్రామ ప్రజలను ఆదుకోవాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు నిర్లక్ష్యం వహిస్తే ఉద్యమ కార్యచరణ తీసుకుంటామని హెచ్చరించారు.
జెడ్పిటిసి సభ్యులు కామిరెడ్డి శ్రీలత మాట్లాడుతూ గోదావరి వరదల కారణంగా వ్యాపారస్తులు రైతులు నష్టపోతున్నారని విచారం వ్యక్తం చేస్తూ బాధిత గ్రామాలకు శాశ్వత పరిష్కారం చూపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .
బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు బెజ్జం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ముంపు బాధితుల సమస్యలు పరిష్కరించాలని ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని సూచించారు.
బిఆర్ఎస్ నాయకులు కే వి రమణ మాట్లాడుతూ 2022లో మండల కేంద్రంలో రిలే నిరాహార దీక్ష దీక్ష శిబిరాన్ని సందర్శించి ముంపు బాధితులకు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తానని నాడు మాట ఇచ్చిన నేటి రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమస్య పరిష్కార దిశగా కృషి చేయాలని డిమాండ్ చేశారు.
సిపిఎం మండల అధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారిన ముంపు బాధితుల ఘోడు పట్టించుకునే నాధుడే కరువయ్యారని విచారం వ్యక్తం చేస్తూ సమస్య పరిష్కరించే వరకు ప్రజల పక్షాన పోరాడుతామని హెచ్చరించారు.
బిజెపి నాయకులు దామర శ్రీనువాసు మాట్లాడుతూ ముంపు బాధిత గ్రామాలకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం శాశ్వతంగా పరిష్కారం చూపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .
ఈ కార్యక్రమంలో భద్రాద్రి పరిరక్షణ సమితి అధ్యక్షులు బూసిరెడ్డి శంకర్ రెడ్డి, బి ఆర్ ఎస్ నాయకులు జెడ్పిటిసి సభ్యులు కామిరెడ్డి శ్రీలత, బిక్కసాని శ్రీను, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, కొనకంచి శ్రీనివాసరావు, చుక్కపల్లి బాలాజీ, భూపల్లి నరసింహారావు, వలదాసు సాలయ్య, ఈవిఆర్ , టిడిపి నాయకులు తాళ్లూరి జగదీష్, బిజేపి నాయకులు బిజ్జం శ్రీనివాస్ రెడ్డి , శ్రీనివాస గౌడ్ , దామర శ్రీను, సిపిఎం నాయకులు భక్తుల వెంకటేశ్వర్లు , భయ్యా రాము, రాయల వెంకటేశ్వర్లు , వర్తక సంఘం నాయకులు లక్కోజు విష్ణు , గూడూరు వెంకన్న, స్థానికులు ఉపాధ్యాయులు లైక్ పాషా, సోహెల్ పాషా , మాడిసెట్టి లక్ష్మణ్ , దస్తగిరి ,,మున్నా, సరఫరాజ్ అలీ బాబా, కేసుపాక బిక్షాలరావు, ప్రభాకర్, ఆటో యూనియన్ నాయకులు రైతులు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.