మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

వనస్థలిపురం, అక్టోబర్ 18: ( ప్రశ్న ఆయుధం) ఎల్బీనగర్ నియోజకవర్గం వనస్థలిపురం డివిజన్ హుడా సాయి నగర్ కాలనీకి చెందిన గంగాధర్ నాయీ ఇటీవల అకాల మరణం చెందారు. ఈ విషయాన్ని తెలుసుకున్న వనస్థలిపురం నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు రాపర్తి రవీందర్ దృష్టికి తీసుకెళ్లగా స్పందించి మృతుడి కుటుంబానికి 25 కేజీల బియ్యం, 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందించి మానవత్వం చాటుకున్నారు. అనంతరం రాపర్తి రవీందర్ మాట్లాడుతూ గంగాధర్ నాయీ చాలా మంచి వారని మన మధ్య లేకపోవడం బాధాకరమని అన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేశారు. ఆర్థిక సహాయం అందుకున్న మృతుడి కుటుంబ సభ్యులు వనస్థలిపురం నాయీ బ్రాహ్మణ సంఘ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, అశోక్ కుమార్, భాస్కర్, నరసింహ, జీవన్, మల్లేష్, మధు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now