బస్తీ దవాఖానల్లో నాణ్యమైన వైద్యసేవలు అందించాలి  

బస్తీ దవాఖానల్లో నాణ్యమైన వైద్యసేవలు అందించాలి  

— కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి 

(ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 24

 

జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ బుధవారం హరిజనవాడ బస్తీ దవాఖానను సందర్శించి అక్కడ అందిస్తున్న వైద్యసేవలను సమీక్షించారు. ఈ సందర్బంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. చంద్రశేఖర్ తో కలిసి వైద్యుల హాజరు, సిబ్బంది సమయపాలనను పరిశీలించారు. వైద్యులు రోగులకు నాణ్యమైన సేవలు అందించి, ప్రజల్లో బస్తీ దవాఖానలపై నమ్మకం పెంపొందించాలన్నారు.

రోగులను ప్రత్యక్షంగా కలసి అందుతున్న సేవలపై వివరాలు తెలుసుకున్నారు. అవసరమైన వైద్యసహాయం కోసం తక్షణమే బస్తీ దవాఖానలను సంప్రదించాలన్న సూచనలు చేశారు. అధిక వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున సిబ్బంది అప్రమత్తంగా ఉండి రోగులకు అవసరమైన చికిత్స అందించాలన్నారు. ఆసుపత్రి లోపలతో పాటు పరిసరాలు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

అదే విధంగా బస్తీ దవాఖాన పక్కన నిర్మాణంలో ఉన్న బాలసదనం పనులను పరిశీలించి మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డికి వేగంగా, నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జనార్ధన్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now