నిరుపేద విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పించండి

నిరుపేద విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పించండి

– బీఆర్ఎస్ నేత చిమ్ముల గోవర్ధన్ రెడ్డిని కోరిన మంబాపూర్ గ్రామ ప్రజలు

ప్రశ్న ఆయుధం :

నిరుపేద విద్యార్థులకు రవాణా సౌకర్యాన్ని కల్పించాలని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డిని మంబాపూర్ గ్రామ ప్రజలు కోరారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల పరిధిలోని మంబాపూర్ గ్రామంలో నిరుపేద విద్యార్థులకు కేవలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల 5వ తరగతి వరకే ఉండడం. ఆపై చదువుల కొరకు మండల కేంద్రమైన గుమ్మడిదల లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వెళ్లాల్సి ఉంటుంది. మంబాపూర్ గ్రామం నుండి గుమ్మడిదల మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల వరకు సుమారు నాలుగు కిలోమీటర్ల మేరా దూరం.. విద్యార్థులు రావాల్సి ఉంటుంది. దీంతో విద్యార్థులు ప్రతిరోజూ పాఠశాలకు వచ్చి వెళ్ళేందుకు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మంబాపూర్ గ్రామ ప్రజాప్రతినిధులు ప్రజలు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డిని కలిశారు. తమ గ్రామ నిరుపేద విద్యార్థులకు రవాణా సౌకర్యాన్ని కల్పించాలని ఆయనను కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన గోవర్ధన్ రెడ్డి త్వరలోనే విద్యార్థుల కొరకు ప్రత్యేకంగా ఆటో రవాణా సౌకర్యాన్ని కల్పిస్తామని గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు.తాజా మాజీ సర్పంచ్ కంజర్ల శ్రీనివాస్, మాజీ ఉపసర్పంచ్ దయానంద్, నాయకులు బి ఆర్ ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు చాకలి ప్రకాష్ ,దయానంద్ ,లక్ష్మణ్, రాజు, నాగరాజు, సాయి, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now