పి ఆర్ టి యు సర్వసభ్య సమావేశం

పిఆర్టియు జిల్లా కార్యదర్శి ఎడెల్లి బాలకృష్ణ

 

మర్కుక్ సెప్టెంబర్ 29 ప్రశ్న ఆయుధం :

 

సిద్దిపేట పిఆర్టియు జిల్లా శాఖ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశము నిర్వహించారు. ఈ సమావేశానికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘోతం రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సమావేశంలో 2024 -26 రెండు సంవత్సరాల గాను జిల్లా శాఖ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ కార్యవర్గంలో మన మర్కుక్ మండలంలో యుపిఎస్ అంగడి కిష్టాపూర్ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఏడెల్లి బాలకృష్ణ జిల్లా కార్యదర్శిగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రేబల్లి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి తుమ్మ కుమార్ లు శుభాకాంక్షలు ఉపాధ్యాయుల సంక్షేమం కోసం పాఠశాలలో విద్యా విద్యాభివృద్ధి కొరకు ఉపాధ్యాయుల సమస్యల సాధన కొరకు కృషి చేయాలని సమావేశంలో తీర్మానించారు. ఈ కార్యక్రమంలో మర్కుక్ మండల అధ్యక్షులు, రేబల్లి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి కుమార్, రాష్ట్ర బాధ్యులు నరసింహులు, షాబుద్దీన్, కూచి రెడ్డి, రజిత వెంకటేశ్వర్ రెడ్డి మాజీ మండల అధ్యక్షులు రామకృష్ణారెడ్డి, సీనియర్ నాయకులు రమణారావు గణేష్ మండల కార్యవర్గ సభ్యులు శ్రీను కృష్ణ సంధ్యారాణి పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now