పిఆర్టియు కామారెడ్డి జిల్లా శాఖ క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి
ప్రశ్న ఆయుధం కామారెడ్డి జిల్లా ప్రతినిధి డిసెంబర్ 29:
ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి పిఆర్టియు కామారెడ్డి జిల్లా శాఖ క్యాలెండర్ ను ఆవిష్కరించరు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలల్లో మౌలిక వసతులు అభివృద్ధి చెందిన నాడు ఉపాధ్యాయుల కృషికి అదనపు బలం చేకూరి విద్యార్థుల సంఖ్య పెరిగి ప్రభుత్వ విద్య బలోపేతం అవుతుందని అందుకు ఉపాధ్యాయులు శక్తివంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చినారు.జిల్లా అధ్యక్షులు అల్లాపూర్ కుశాల్ మాట్లాడుతూ పాఠశాలలలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రతి పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమూహాన్ని ఏర్పరచడం ద్వారా బాధ్యతాయుతమైన సమాజాన్ని ఆశించవచ్చని అన్నారు.ప్రధాన కార్యదర్శి పుట్ట శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా గత సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య కన్నా ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించే విద్యార్థుల సంఖ్య పెరిగిందని రాబోవు కాలంలో మరింత బలోపేతం దిశగా ఉపాధ్యాయుల కృషి చేయడం జరుగుతుందని తెలిపినారు.ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అల్లాపూర్ కుశాల్ ప్రధాన కార్యదర్శి పుట్టా శ్రీనివాస్ రెడ్డి తో పాటు పలువురు రాష్ట్ర జిల్లా మండల బాధ్యులు వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుతదితరులు పాల్గొన్నారు.