పి ఆర్ టి యు కామారెడ్డి జిల్లా నూతన వర్గం ఏకగ్రీవం

పి ఆర్ టి యు కామారెడ్డి జిల్లా నూతన వర్గం ఏకగ్రీవం

అధ్యక్షుడిగా అంబీర్ మనోహర్ రావు – ప్రధాన కార్యదర్శిగా జనపాల లక్ష్మీరాజం

కామారెడ్డి జిల్లా పి ఆర్ టి యు కార్యవర్గం ఎన్నికలు ఏకగ్రీవం

ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ

నూతన పి ఆర్ సి వెంటనే అమలు – పెండింగ్ డి ఏలు విడుదల డిమాండ్

సిపిఎస్ రద్దు – ఓ పి ఎస్ పునరుద్ధరణ తీర్మానం

ప్రశ్న ఆయుధం ఆగష్టు 31కామారెడ్డి :

కామారెడ్డి జిల్లా పి ఆర్ టి యు తెలంగాణ జిల్లా కార్యవర్గ సమావేశం ఆదివారం దేవి విహార్ లోని జిల్లా కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా అంబీర్ మనోహర్ రావు, ప్రధాన కార్యదర్శిగా జనపాల లక్ష్మీరాజం ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ – సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి నాయకత్వంలో పి ఆర్ టి యు బలోపేతానికి కృషి చేస్తూనే, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో ముందుండతామని హామీ ఇచ్చారు.ఎన్నికల అధికారులుగా ఎం. నరసింగరావు, టి. ప్రభాకర్ బాధ్యతలు నిర్వర్తించారు.సమావేశంలో పలు ముఖ్య తీర్మానాలు ఆమోదం పొందాయి. అందులో ముఖ్యంగా – నూతన పి ఆర్ సి అమలు, ఐదు డి ఏలు విడుదల, పెండింగ్ బిల్లుల క్లియరెన్స్, సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు వేతన చెల్లింపులు, కేజీబీవీ ఉపాధ్యాయినీలకు మినిమం టైమ్ స్కేలు, సమగ్ర శిక్ష అభియాన్ సిబ్బందికి సమ్మె కాలపు 29 రోజుల జీతం చెల్లింపు, బి.ఎడ్ చేసిన వారికి హెచ్‌ఎమ్ ప్రమోషన్లు, అలాగే 317 జీ ఓ లో నష్టపోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని తీర్మానించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు లెనిన్, రమణ, సురేందర్, సురేష్, నరేష్, సూర్య, ఎల్లగౌడ్, వెంకట్, ఆనంద్, నర్సింలు, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment