పి ఎస్ హెచ్ఎం ఏటిజి రాష్ట్ర సమావేశానికి భారీగా తరలి రండి – జిల్లా నేతల పిలుపు
16న హైదరాబాద్ కూకట్పల్లి జడ్పీ హైస్కూల్లో రాష్ట్ర స్థాయి సమావేశం
కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఐ. రమేష్‌కుమార్ గౌడ్ పిలుపు
జిల్లా ప్రధాన కార్యదర్శి పందిరి రాజేష్‌తో కలసి పత్రిక ప్రకటన
ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు తప్పనిసరిగా హాజరుకావాలి
విజయవంతం చేయడంలో కామారెడ్డి జిల్లా ముందుండాలి పిలుపు
తెలంగాణ స్టేట్ ఇంచార్జ్.ప్రశ్న ఆయుధం) ఆగస్ట్ 14
పి ఎస్ హెచ్ ఎం (ఎల్ ఎఫ్ ఎల్ హెచ్ ఎం ) రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం ఆగస్టు 16న హైదరాబాద్ కూకట్పల్లి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరగనుంది. ఈ సమావేశానికి కామారెడ్డి జిల్లా నుండి భారీ సంఖ్యలో ఉపాధ్యాయులు తరలిరావాలని జిల్లా అధ్యక్షుడు ఐ. రమేష్‌కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. జిల్లా ప్రధాన కార్యదర్శి పందిరి రాజేష్‌తో కలిసి ఆయన పత్రిక ప్రకటన విడుదల చేస్తూ, “ప్రతి ఒక్క సభ్యుడు హాజరై రాష్ట్ర సమావేశాన్ని విజయవంతం చేయాలి” అని కోరారు.