మేడ్చల్ కలెక్టరేట్‌లో ప్రజావాణి – 91 ఫిర్యాదులు స్వీకరణ

*మేడ్చల్ కలెక్టరేట్‌లో ప్రజావాణి – 91 ఫిర్యాదులు స్వీకరణ*

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రశ్న ఆయుధం మే 5

IMG 20250505 WA2201 మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) హరిప్రియ, తహసీల్దారు రాజశేఖర్ రెడ్డితో కలిసి ప్రజల సమస్యల అర్జీలను స్వీకరించారు. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ప్రజావాణిలో మొత్తం 91 ఫిర్యాదులు అందాయి.

ఈ సందర్భంగా డీఆర్ఓ హరిప్రియ మాట్లాడుతూ, వివిధ శాఖల జిల్లా అధికారులు తమకు అందిన దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించాలని ఆదేశించారు. ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు నిర్వహిస్తున్న ఈ ప్రజావాణిలో ప్రజలు అందించే వినతులకు సంబంధిత శాఖల అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతేకాకుండా, ఆయా వినతులపై తీసుకున్న చర్యల యొక్క వివరాలను తప్పనిసరిగా ఆన్‌లైన్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని ఆమె స్పష్టం చేశారు.

ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన ప్రతి దరఖాస్తుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని డీఆర్ఓ అధికారులకు సూచించారు. ప్రజల ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలని, ఎలాంటి అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు వాటిని సమీక్షిస్తూ సమస్యలకు పరిష్కారం చూపాలని ఆమె ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా స్థాయి అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now