గ్రామాలలో వార్డులలో ప్రజాపాలన సభలు

గ్రామాలు,వార్డులలో ప్రజా పాలన గ్రామసభలు

*జమ్మికుంట జనవరి 21 ప్రశ్న ఆయుధం*

జమ్మికుంట పట్టణంలోని పలు వార్డులలో మండలంలోని పలు గ్రామాలలో మంగళవారం అధికారులు ప్రజా ప్రతినిధులు ప్రజాపాలన గ్రామసభలు నిర్వహించారు.జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 21వ వార్డులో ప్రజా పాలన సభను మున్సిపల్ చైర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగింది.ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు రేషన్ కార్డుల విషయంలో కానీ ,ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కానీ, రేషన్ కార్డులో తమ పిల్లల పేర్లు ఎంట్రీ కాకపోవడంతో పలువురు ఆవేదన వ్యక్తం చేస్తూ సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ పిల్లల పేర్లు రేషన్ కార్డులో రాకపోవడం బాధాకరంగా ఉందని అన్నారు అనంతరం మున్సిపల్ చైర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సంవత్సర పాలన గడుస్తున్నప్పటికీ ఏ ఒక్క నిరుపేద కూడా సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అందడం లేదని ప్రభుత్వంపై మండిపడ్డారు. కేవలం ప్రజా పాలన పేరిట పథకాల అమలు చేస్తామని మాయమాటలు చెప్పి ప్రజలను మోసగించకుండా కచ్చితంగా ప్రతి ఒక్క రేషన్ కార్డు లేని వ్యక్తికి రేషన్ కార్డులు అందజేయాలని, నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడంతో పాటు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను రిలీజ్ చేయడంతో పాటు తులం బంగారం ఇచ్చే విషయంలో ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

Join WhatsApp

Join Now