ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ప్రజా పాలన-విజయోత్సవాలు
ప్రశ్న ఆయుధం న్యూస్, డిసెంబర్ 4, కామారెడ్డి :
కామారెడ్డి స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె విజయ్ కుమార్ అధ్యక్షతన ప్రజా పాలన విజయోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయిన సందర్భంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన- ప్రజా విజయోత్సవాలు కార్యక్రమాన్ని రాష్ట్ర పండుగగా ఈనెల 1 నుండి 9 తారీకు వరకు నిర్వహించే కార్యక్రమంలో భాగంగా బుధవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కామారెడ్డిలో నిర్వహించిన కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కే. విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలంలో వివిధ ప్రభుత్వ పథకాలు, సాధించిన విజయాలు గురించి వివరించారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కె. కిష్టయ్య మాట్లాడుతూ విద్యార్థులు రాజ్యాంగం, ప్రజాస్వామ్యం గురించి అవగాహన పెంపొందించుకోవాలని సమాజం పట్ల బాధ్యతయుతంగా మెలగాలని ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వాటి ప్రయోజనాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కే. విజయ్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కే.కిష్టయ్య, అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ పి.విశ్వప్రసాద్, ఎన్సిసి ప్రోగ్రాం ఆఫీసర్ లెఫ్ట్నెంట్ డాక్టర్ ఏ. సుధాకర్, యూజీసీ కోఆర్డినేటర్ డాక్టర్ గణేష్, డాక్టర్ జి. శ్రీనివాసరావు, డాక్టర్.రాజ్ గంభీర్, డాక్టర్ శారద, డాక్టర్ తిరుమల మల్సూర్, కోరే శ్రీనివాస్, డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్, జయప్రకాష్, పర్వీన్ ఫాతిమా, శ్రీలత, స్వాతి, తదితరులు పాల్గొన్నారు