ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజావాణి మేల్కొలుపు
— ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 22
ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజావాణి కార్యక్రమం దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ పేర్కొన్నారు.
సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ స్వయంగా ఫిర్యాదుదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులను తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జిదారుల మొత్తం 110 ఫిర్యాదులు స్వీకరించబడ్డాయి. అర్జిదారులు ఒకే సమస్యపై తిరిగి అర్జి పెట్టుకోకుండా తక్షణమే పరిష్కారం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.