Site icon PRASHNA AYUDHAM

లీగల్ మెట్రాలజీ చట్టాలపై ప్రజలకు అవగాహన అవసరం

IMG 20250522 WA2361

*లీగల్ మెట్రాలజీ చట్టాలపై ప్రజలకు అవగాహన అవసరం*

*ఏఐసిడబ్ల్యుసి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజుల రామనాథం*

ప్రశ్న ఆయుధం మే 22: బాల్కొండ మండలంలో వినియోగదారుల సమస్య జాతీయ ప్రధాన కార్యదర్శి సాంబరాజ చక్రపాణి మరియు రాష్ట్ర సమైక్య అధ్యక్షులు మొగిలిచర్ల సుదర్శన్ వారి ఆదేశానుసారం అంతర్జాతీయ లీగల్ మెటరాలజీ ఉత్సవాలను గురువారం రోజు జరపడం జరిగింది. వినియోగదారులు లీగల్ మెట్రాలజీ శాఖ చట్టాలను, నిబంధనలపై ప్రజలకు అవగాహన పెంచాలని వాటి గురించి తెలుసుకోవాలని అఖిల భారత వినియోగదారుల వెల్ఫేర్ కౌన్సిల్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజుల రామనాథం అన్నారు. గురువారం అంతర్జాతీయ లీగల్ మెట్రాలజీ ఉత్సవాలను పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలోని పాండురంగ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బాంక్ లో ఇందుకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించి ప్రజలకు అవగాహన కల్పించారు. వినియోగదారులు వినియోగించే వస్తువులపై ముద్రించే ఎక్స్పైరీ డేట్ చూసి వినియోగించాలని అలాగే వస్తూ నాణ్యత పరిమాణాల పట్ల కనీస అవగాహన ఉండాలని లీగల్ మెట్రాలజీ రూల్స్ 2011లో బ్రీత్ అనాలైజర్, ఎలక్ట్రిక్ మీటర్లు, విధి విధానాల గురించి ఇప్పటికే సవరణలో చేర్చిన టాక్సీ మీటరు గ్లూకోస్ మీటర్లు, మైశ్చరైసర్ మీటర్లు ల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఇండియన్ ఆయిల్ అండ్ గ్యాస్ నిజామాబాద్ సేల్స్ ఆఫీసర్ వి మహేష్ మాట్లాడుతూ ప్రతిరోజు మన వినియోగించే వస్తువులను తగు జాగ్రత్త తిసుకొని వాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ అండ్ గ్యాస్ సేల్స్ ఆఫీసర్ వి మహేష్ ఐఓసీ డీలర్ ప్రసాద్, వికాస్,ప్రముఖ పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version