Site icon PRASHNA AYUDHAM

ఓటు హక్కు వినియోగంపై ప్రజలకు అవగాహన కార్యక్రమం

Galleryit 20251201 1764593624

ఓటు హక్కు వినియోగంపై ప్రజలకు అవగాహన కార్యక్రమం

 

ప్రలోభాలకు లోనుకాకండి పోలీసుల సూచనలు

 

ప్రశ్న ఆయుధం

 

కామారెడ్డి జిల్లా డిసెంబర్ 1:

 

ఎన్నికల నేపథ్యంలో ప్రజల్లో అవగాహన పెంచేందుకు కామారెడ్డి జిల్లా పోలీస్ కళాబృందం సోమవారం తాడ్వాయిలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. జిల్లా ఎస్పీ M. రాజేష్ చంద్ర IPS ఆదేశాల మేరకు, ఈ కార్యక్రమం సబ్-ఇన్స్పెక్టర్ Y. నరేష్ ఆధ్వర్యంలో జరిగింది.

 

ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఎటువంటి డబ్బు, మద్యం వంటి ప్రలోభాలకు లోనుకాకుండా, ప్రతి ఓటరు తన విలువైన ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలి అని సూచించారు. పాత కక్షలు, వ్యక్తిగత తగాదాలను ఎన్నికల సమయంలో ప్రోత్సహించరాదని, శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరగేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.

 

అలాగే అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్ 100 సంప్రదించాలని, అలాగే రోడ్డు ప్రమాదాల నివారణ కోసం మొబైల్ ఫోన్లు, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా వాడకంలో జాగ్రత్తలు పాటించాలి అని అవగాహన కల్పించారు.

 

ఈ కార్యక్రమంలో పోలీస్ కళాబృందం ఇన్‌చార్జ్ హెడ్ కానిస్టేబుల్ రామంచ తిరుపతి, హెడ్ కానిస్టేబుల్ U. శేషారావు, పోలీసులు ప్రభాకర్, సాయిలు పాటలు, మాటల ద్వారా ప్రజల్లో ఎన్నికల చైతన్యం కల్గించారు.

Exit mobile version