నగదు బదిలీతో ప్రజా పంపిణీ సమాదే

నగదు బదిలీతో ప్రజా పంపిణీ సమాదే

వ్యవసాయ కార్మిక సంఘం (బికేఎంయు) జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొత్స మోహన్ రావు, గరుగుబిల్లి సూరయ్య,

పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి జూన్ 9 ( ప్రశ్న ఆయుధం న్యూస్) దత్తి మహేశ్వరరావు

రాష్ట్ర ప్రభుత్వం రేషన్ బియ్యం బదులుగా నగదు బదిలీ అమలు చేసే ఆలోచన ప్రజా పంపిణీ వ్యవస్థను సమాధి చేయడమేనని, నగదు బదిలీతో పేదలు, కష్టజీవులు కడుపులు మాడ్చే పరిస్థితులు తీసుకురావద్దని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం పార్వతీపురం మన్యం జిల్లా సమితి ఆగ్రహం వ్యక్తం చేసింది, ఈ మేరకు సంఘం జిల్లా అధ్యక్షులు,ప్రధాన కార్యదర్శి బొత్స మోహన్ రావు గరుగుబిల్లి సూరయ్య లు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు, రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నదని నెపముతో పేదలకు బియ్యం పంపిణీ నుంచి తప్పుకోవాలని దుష్ట ఆలోచన మంచిది కాదని అన్నారు, బియ్యం స్థానంలో డబ్బులు ఇస్తే మద్యం దుకాణాలకు, బెల్ట్ షాపులకు వెళుతుందని దీనివల్ల కుటుంబ కలహాలకు దారితీస్తుందని, పేదవారు ఒక్క పూట కూడా సక్రంగా తిండి తినే పరిస్థితి ఉండదని అన్నారు, తెలంగాణ ప్రభుత్వ తరహాగా సన్నబియ్యం కుటుంబానికి సరిపడా పెంచి ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు, దానితో పాటుగా ఇతర నిత్యవసర వస్తువులు కూడా ఇవ్వాలని ప్రకటనలో కోరారు, వాహనాలు తీసివేసి ఇంటి వద్ద రేషన్ అందించకపోవడంతో పేద ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, ఇప్పటికే ప్రభుత్వానికి తెలిసినప్పటికీ మొండుగా డీలర్ల ద్వారా బియ్యం పంపిణీ చేస్తుందని అన్నారు, ఎండియు వాహనాలు రాకముందును అక్రమ రవాణా ద్వారా అవినీతి జరిగిందని గుర్తు చేశారు, గిరిజన ప్రాంతాల్లో ఎండీయూ వాహనాల ద్వారా మారుమూల గ్రామాల సైతం కొండ ప్రాంతాలకు పైకి పేదలకు బియ్యం పంపిణీ కోసం ఎండిఓ వాహనాలు కొంతవరకైనా వెళ్లేవి Cbse అన్నారు, ఎండియు వాహనాలు తొలగించిన తర్వాత గిరిజన గ్రామాల్లో ప్రాంతాల్లో గిరిజనులు పేదలు బియ్యం కోసం నానాపాట్లు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు, ఎండయు వాహనాలు పునరుద్ధరణలతోనే పేదలకు పంపిణీ సులువుగా అందుతుందని అన్నారు, ఏమైనా అవకతకులు ఉంటే ప్రభుత్వం వాటిని సరిచేయాలనీ డిమాండ్ చేస్తున్నాము, ప్రభుత్వము ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని నగదు బదిలీ కార్యక్రమాన్ని విరమించుకోవాలని, ప్రజా పంపిణీ ని పగడ్బందీగా అమలు చేయాలని, రానున్న రోజుల్లో పేదలను కలుపుకొని వ్యవసాయ కార్మికుల సంఘం పోరాడుతుందని అన్నారు,,

Join WhatsApp

Join Now