తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు
మర్కుక్ సెప్టెంబరు 17 ప్రశ్న ఆయుధం :
ప్రాథమికోన్నత పాఠశాల శివారు వెంకటాపూర్ లో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది
కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవనీయులు మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కూచి రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయిని,ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు బ్రిటిష్ వారు మనకు స్వాతంత్ర్యాన్ని ప్రకటించిన తర్వాత కూడా కొన్ని స్థానిక రాజ్యాలు అనగా హైదరాబాద్ లాంటివి రాజుల పరిపాలనలో ఉన్నవి వాటిని భారతదేశంలో కలుపుకోవడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రయత్నం మర్చిపోలేనటువంటి అని గుర్తుచేస్తూ హైదరాబాద్ కు ఎలా స్వాతంత్రం వచ్చిందో విద్యార్థులకు సవివరంగా తెలియజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు నరేందర్ రెడ్డి , ఉపాధ్యాయులు ముత్తయ్య, తుమ్మ కుమార్, మధు, పద్మజ ,సృజన మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.