గుమ్లాపూర్ లో ప్రజా పాలన విజయోత్సవ కార్యక్రమం 

గుమ్లాపూర్ లో ప్రజా పాలన విజయోత్సవ కార్యక్రమం

కోరుట్ల మండలం గుమ్లాపూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రజా పాలన విజయోత్సవాలలో భాగంగా మంగళవారం గుమ్లాపూర్ ఉత్తమ పారిశుద్ధ కార్మికునికి, ఉపాధి హామీ కూలికి సన్మానం చేశారు. ప్రజాపాలన విజయోత్సవాల పనుల జాతరలో భాగంగా పశువుల షెడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో బిసి సెల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం వెంకటేష్ గౌడ్, గ్రామ కార్యదర్శి శ్రీనివాస్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగని శంకర్, నాయకులు కొత్తపల్లి శంకర్, సురకంటి అరుణ్ రావు, భూసం సతీష్, మంద వెంకటేష్, గంగ మల్లయ్య, కొక్కుల శ్రీనేష్, ఉపాధి హామీ ఫీల్డ్ ఆసిట్టంట్ రాజేందర్, గ్రామ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment