*ప్రభుత్వ భూ అక్రమణ దారులను కఠినంగా శిక్షించాలి*
*సర్వే నెంబర్ 647 లో జరుగుతున్న అక్రమాలపై విచారణ చేపట్టాలనీ కలెక్టర్ కు వినతిపత్రం*
*జమ్మికుంట మార్చి 24 ప్రశ్న ఆయుధం*
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని 647 సర్వేనెంబర్ లో గల పూర్వపు శ్రీనివాస ఇంగ్లీష్ మీడియం పాఠశాలకు కేటాయించిన స్థలాన్ని 633 సర్వే నెంబర్లు దొంగ పట్టా చేయడం జరిగిందని దానిపై చర్యలు తీసుకోవాలని సోమవారం ప్రజావాణి కలెక్టర్ కార్యాలయంలో అమ్మ వెంకటేష్ యాదవ్ జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ 647 సర్వే నెంబర్లో గల రెండు ఎకరాల భూమి ఏ విధంగా తప్పుడు సర్వే నెంబర్లతో రిజిస్ట్రేషన్ చేశారని, అలాగే 647 సర్వే నెంబర్లు దాదాపు నాలుగు ఎకరాల భూమి దొంగ రిజిస్ట్రేషన్ చేయడం స్థలం ఒక కాడ ఉన్న సర్వేనెంబర్ మరొక కాడ ఉన్నటువంటి పత్రాలను కలెక్టరు కి సమర్పించి దీనిపైన వివరణ కోరడం జరిగిందని తక్షణమే సంబంధిత అధికారులను కేటాయించి ప్రభుత్వ భూములను కాపాడి అవసరమైతే ఆ స్థలాన్ని గూడు లేని పేద ప్రజలకు కేటాయించేలా చూడాలని జిల్లా కలెక్టర్ ని కోరడం జరిగిందని అమ్మ వెంకటేష్ యాదవ్ తెలిపారు ప్రభుత్వ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న అమ్మిన వారిపై కఠినంగా శిక్షించాలని ఏ ఉద్దేశంతో అయితే ప్రభుత్వం భూమి కేటాయించిందో దానిని సద్వినియోగం చేసుకున్న దుర్వినియోగం చేసుకుంటున్న వారి భూమిని ప్రభుత్వం స్వాధీనపరచుకొని నిరుపేదలకు గూడు లేని అభాగ్యులకు కేటాయించాలని కోరారు