●మండల తహసీల్దార్ కమలాద్రి..
ప్రశ్న ఆయుధం న్యూస్ సెప్టెంబర్ 19 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)
శివ్వంపేట మండలంలోని అన్ని గ్రామాలలో ఏవైనా భూసమస్యలు ఉన్నట్లయితే వాటి పరిష్కా రానికి ప్రతి సోమవారం మండల తహసీ ల్దార్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్ర మం ద్వారా దరఖాస్తుల స్వీకరణ నిర్వహిం చడం జరుగుతుందని తహసీల్దార్ కమ లాద్రి బుధవారం ఒక ప్రకటనలో తెలి పారు. భూసమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి రైతులు, అర్జీదా రులు వెళ్లాల్సిన అవసరం లేదని ఆయనతెలిపారు. ఎవరైనా భూసమస్య ఉందని దాని పరిష్కారానికి ప్రతి సోమవారం నిర్వ హించే తహసీల్దార్ కార్యాలయంలో నిర్వ హించే ప్రజావాణి కార్యక్రమంలో పిర్యాదు చేయవచ్చునని ఆయన అన్నారు. దరఖాస్తు చేసుకునే అర్జీదారు భూమికి సంబం దించిన ఆధారాలు, అందుకు సంబం దించిన ధ్రువపత్రాలతో దరఖాస్తు చేయా లని, ఈసదావకాశాన్ని మండల ప్రజలం దరూ, రైతులు సద్వినియోగం చేసుకో వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.