ప్రజా గొంతుక ధిక్కార ప్రతీక కాళోజీ..!
అక్షరాన్ని ఆయుధంగా మలిచి, మాటల తూటాలతో ప్రజా ఉద్యమాలకు తన జీవితాన్ని ధారబోసిన యోధుడు మన కాళన్న కవిగా రచయితగా సమాజంలోని అన్యాయాలకు, అణిచివేతలకు వ్యతిరేకంగా పోరాడుతూ. తెలంగాణ రాష్ట్ర సాధనకు పరితపించిన అక్షర తపస్వి కాళోజీ నారాయణ రావు
తెలంగాణ భాష బడి పలుకుల భాష కాదు, పలుకుబడుల భాష అని ఎలుగెత్తి చాటిన మహనీయుడు కాళోజీ జయంతిని (సెప్టెంబర్ 9) కేసీఆర్ తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహించారు. వైద్య విశ్వవిద్యాలయానికి వారి పేరు పెట్టారు. వరంగల్‌లో సుందరమైన కాళోజీ కళాక్షేత్రాన్ని నిర్మించారు.
స్వాతంత్ర్య సమరయోధునిగా, తెలంగాణ ఉద్యమకారునిగా కాళోజీ అందించిన స్ఫూర్తి, చేసిన సేవలు సదా స్మరణీయం.
కాళోజీ నారాయణ రావు వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు .