*పీడిత వర్గాల విముక్తి కోసం పోరాడిన యోధుడు పుచ్చలపల్లి*
*సుందరయ్య ఆశయాలను కొనసాగిస్తాం*
*జమ్మికుంట మే 19 ప్రశ్న ఆయుధం*
కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య ఆశయ సాధన కొరకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సిపిఎం మండల కార్యదర్శి శీలం అశోక్ అన్నారు సోమవారం రోజున పుచ్చలపల్లి సుందరయ్య 40 వర్ధంతిని పురస్కరించుకొని పార్టీ కార్యాలయంలో సుందరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం శీల అశోక్ మాట్లాడుతూ పీడిత ప్రజల విముక్తి కొరకు పోరాడిన యోధుడని నిరాడంబర జీవి పీడిత వర్గాల కోసమే నిరంతరం పోరాడుతాలు చేసిన నాయకుడని పుచ్చలపల్లి సుందరయ్య అగ్రవర్ణాలలో పుట్టి తన పేరు చివరన రెడ్డి అనే పదాన్ని తొలగించుకున్న గొప్ప పోరాట యోధుడు వారి స్ఫూర్తితో వారి ఆశయాలను దేశంలోని పీడిత వర్గాల ప్రజల కోసం నిరంతరం పోరాటాలు చేసి ఆదర్శప్రాయంగా నిలిచిన నాయకుడు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య అని తన జీవితాన్ని మొత్తం బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం శ్రామికుల కోసం త్యాగం చేశారని సుందరయ్య తనకున్న 100 ఎకరాల భూమి నీ సైతం పేద ప్రజలకు ఇచ్చిన ఘనత తనకే దక్కుతుందని పేర్కొన్నారు.ఈ దేశంలో ఎంతో మంది రాజకీయ నాయకులు పదవి వస్తే చాలు కోట్ల రూపాయలు సంపాదించుకొని విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని అదే సుందరయ్య మూడుసార్లు శాసన సభ్యులు గా అట్లాగే పార్లమెంట్ సభ్యులు గా పార్లమెంట్ సభ్యుడైన కూడా చట్టసభలకు సైకిల్ మీదనే పార్లమెంటు కు వెళ్లిన ఘనత ఆయనకే దక్కుతున్నన్నారు. 1931 వ సంవత్సరంలో భారత స్వాతంత్ర ఉద్యమం లో పాల్గొని జైలు జీవితం గడిపారని దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమం బలపడడానికి తన వంతు కృషి చేశారని ఆయన ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు
పిల్లలు పుడితే ఉద్యమానికి ఆటంకం కలుగుతుందని పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్న మహా నేత అని ఈ దేశంలో సుందరయ్య ఆశయాలకు అనుగుణంగా ఆయన స్ఫూర్తితో కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పెట్టుబడుదారి వ్యవస్థ అంతమైనప్పుడే నిజమైన పేదవారికి న్యాయం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు జక్కుల రమేష్ యాదవ్, వడ్లూరి కిషోర్ నాయకులు సిరికొండ మధునయ్య, మారపల్లి కిరణ్, తెడ్ల మహేందర్. చల్ల సాగర్, శ్రీనివాస్, రమేష్ , చల్ల కుమారులతోపాటు తదితరులు పాల్గొన్నారు.