‘పులివెందుల జగన్ అడ్డా కాదు’
AP: పులివెందుల త్వరలో టీడీపీ కంచుకోట కాబోతుందని ఎంపీ బైరెడ్డి శబరి పేర్కొన్నారు.
పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికలో టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పులివెందులలో వైసీపీ నేతలు చేస్తున్న అల్లర్లను ఈసీ దృష్టికి తీసుకెళ్తామన్నారు. గత ప్రభుత్వ పాలనలో ప్రజలను దోచుకోవటం సరిపోయిందని.. కేంద్ర ప్రభుత్వం కొప్పర్తికి ఇచ్చిన రూ.1,500 కోట్లు దారి మళ్లించారని ఎంపీ ఆరోపించారు.