Site icon PRASHNA AYUDHAM

పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం: జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య

IMG 20251012 202432

Oplus_131072

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 12 (ప్రశ్న ఆయుధం న్యూస్): పల్స్ పోలియో చుక్కల మందు వేసే మొదటి రోజు కార్యక్రమం విజయవంతమైందని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఇచ్చిన వివరాలు ప్రకారం జిల్లాలో 191668 మంది0-5 సంవత్సరాల లోపు పిల్లలు ఉండగా 186147మంది పిల్లలకు ఆదివారం పల్స్ పోలియో చుక్కలు వేసినట్లు తెలిపారు. 97.11శాతం మంది పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు మొదటిరోజు వేసినట్లు కలెక్టర్ తెలిపారు. పల్స్ పోలియో కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది 1583 మంది, అంగన్వాడీ సిబ్బంది 1505, 904 మంది ఆశా వర్కర్లు, పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్నట్లు కలెక్టర్ తెలిపారు.

*అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధి లో స్టాక్ లేదనడంలో వాస్తవం లేదు.*

 అమీన్పూర్ మండలం, మున్సిపాలిటీ పరిధిలో పోలియో చుక్కల మందు స్టాక్ లేదంటూ జరిగిన ప్రచారంలో వాస్తవం లేదన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అంచనా వేసిన దానికంటే 1500 డోసుల పోలియో చుక్కల మందు పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలో ఎక్కువగా సరఫరా చేసినట్లు కలెక్టర్ తెలిపారు. గతంలో కంటే ఈసారి 60 సెంటర్లు అదనంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 528 మంది పిల్లలకు అదనంగా పోలియో చుక్కలు వేసినట్లు తెలిపారు. సోమవారం, మంగళవారం రెండు రోజులు లో 100శాతం పోలియో చుక్కలు వేసేలా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది అంగన్వాడి సిబ్బంది ఆశా వర్కర్లు ఇంటింటికి తిరిగి పల్స్ పోలియో చుక్కలు వేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Exit mobile version