దారి తప్పిన ఎస్ఐలకు పనిష్మెంట్…
సమీక్షా సమావేశానికి ఆలస్యంగా రావడమే
నిజామాబాద్ (ప్రశ్న ఆయుధం ) జిల్లా ప్రతినిధి:డిసెంబర్:20 పోలీస్ బాస్ పర్యవేక్షణలో ఏర్పాటుచేసిన కీలకమైన సమావేశానికి ఆలస్యంగా వచ్చిన 13 మంది ఎస్ఐలకు తగిన పనిష్మెంట్ దక్కింది. శాంతిభద్రత పరిరక్షించాల్సిన ఎస్సైలు క్రమశిక్షణ తప్పడంతో పోలీస్ బాస్ కన్నయ్య చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆరు రోజుల క్రితం ఏర్పాటు చేసినా సమీక్ష సమావేశానికి పోలీస్ బాస్ ఇన్చార్జ్ సి పి సిహెచ్ సింధు శర్మ సమయానికి రాకుండా కొందరు ఎస్ఐలను 15 నిమిషాల నుంచి మరికొందరు అరగంట ఆలస్యంగా వచ్చారు. క్రమశిక్షణ రాహిత్యం పై కన్నీర చేసిన పోలీస్ బాస్ ఆలస్యంగా వచ్చిన ఎస్ఐలకు గ్రౌండ్లో 10 రౌండ్లు రన్నింగ్ చేయాలని అలాగే పనిష్మెంట్ అమలు ను పరివేక్షించాలని ఏసీబీని ఆదేశించినట్లు విశ్వనీయంగా తెలిసింది. సదరు ఎస్సైలు గ్రౌండ్లో 10 రౌండ్లు రన్నింగ్ చేసి వచ్చిన తర్వాతే సమీక్ష సమావేశం నిర్వహించినట్లు సమాచారం ఇది ప్రస్తుతం పోలీస్ శాఖలో కలకలం రేపింది ఇంచార్జ్ సిపి సింధు శర్మ తీసుకున్న నిర్ణయం క్రమశిక్షణ తప్పే ఎస్సై ల గుండెల్లో గుబులు పుట్టింది.