Site icon PRASHNA AYUDHAM

“హర్ ఘర్ తిరంగా”లో భాగంగా స్వచ్ఛ భారత్

IMG 20250812 WA0037

“హర్ ఘర్ తిరంగా”లో భాగంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం

మేడ్చల్ జిల్లా నాగారం ప్రశ్న ఆయుధం ఆగస్టు 12

“ఆజాదీ కా అమృత్ మహోత్సవ్”లో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన “హర్ ఘర్ తిరంగా” కార్యక్రమానికి మద్దతుగా నాగారం మున్సిపాలిటీలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేశ స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాలను శుభ్రపరచడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచారు.

నేతాజీ నగర్‌లోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద, అలాగే రాంపల్లిలోని భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ విగ్రహాల వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ మున్సిపల్ ఛైర్మన్ చంద్రారెడ్డి, మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ అధ్యక్షుడు నాగరాజు, మున్సిపల్ మహిళా అధ్యక్షురాలు జ్యోతి పాండే తదితర ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కాలనీవాసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారి విగ్రహాలను శుభ్రం చేసి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచారు. ఈ కార్యక్రమం దేశభక్తిని, పౌర బాధ్యతను పెంపొందించే దిశగా సాగింది.

Exit mobile version