గీత కార్మికుల సంఘానికి చెందిన పూరి గుడిసెలను దగ్ధం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

గీత కార్మికుల సంఘానికి చెందిన పూరి గుడిసెలను దగ్ధం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

ఇల్లందకుంట జనవరి 5 ప్రశ్న ఆయుధం

కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం లోని మల్యాల గ్రామ శివారులోని తాటి వనంలో గీత కార్మికులు కూర్చోవడానికి వేసిన రెండు గుడిసెలను ఆదివారం రోజున గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేశారు తాటి వనంలో కూర్చుని స్వేద తీరడానికి వేసుకున్న గుడిసెలు అగ్నికి ఆహుతి అవడంతో సుమారుగా 50వేల రూపాయలు విలువచేసే దగ్ధం అయినట్టు గీత కార్మికులు తెలిపారు దగ్ధం చేసిన గుర్తు తెలియని వ్యక్తులను గుర్తించి కఠినంగా శిక్షించాలని వారి ద్వారా గుడిసెల నష్టపరిహారం చెల్లించాలని కోరారు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా దోషులను శిక్షించాలని కోరారు

Join WhatsApp

Join Now