Site icon PRASHNA AYUDHAM

స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమాలా..?

స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమాలా..?

కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలా..?

స్వచ్ఛదనం పచ్చదనం ఫ్లెక్సీల పై ఎమ్మెల్యే రమణారెడ్డి ఫోటో లేకపోవడం వెనక మతలబు ఏంటి…?

కాటిపల్లి వెంకటరమణారెడ్డి మౌనం వెనుక మతలబ్ ఏంటి…? 

ఎమ్మెల్యే రమణారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఒకటే అని ప్రజల్లో ఉన్న అనుమానం నిజమేనా…?

 

రోడ్ల విస్తరణ రమణారెడ్డి కల ఆ కలని అధికారులు పక్కదారి పట్టిస్తున్న పట్టించుకోకపోవడం వెనక మతలబు ఏంటి..?

 

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమానికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఫోటో వేయకపోవడం వెనుక కారణం ఏంటి ఫోటో కాల్ ప్రకారం కార్యక్రమాలు చేయకపోవడం కామారెడ్డి ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఫోటో కాల్ ప్రకారం వెంకట్ రమణారెడ్డి ఫోటో పెట్టకపోవడం వెంకటరమణారెడ్డి మౌనంగా ఉండడం రెండు పార్టీలు ఒకటేనా..? ఇద్దరు కుమ్మక్కైన రా..? అనే అనుమానాలు కామారెడ్డి ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి అదే కాకుండా నిత్యం మున్సిపల్ కమిషనర్ సుజాత ఆఫీసుకు వస్తున్న ఆమె దృష్టి ఆ ఫ్లెక్సీ పై పడకపోవడం ఆమె ఒక ప్రభుత్వ ఉద్యోగస్తురాలా..?లేదా కాంగ్రెస్ పార్టీ నాయకురాలా..?అనే విధంగా మున్సిపల్ ఉంది అంటే అక్రమ కట్టడాలపై శ్రద్ధ లేకుండా నిజాయితీగా పర్మిషన్లు అడిగిన ఉన్నదాన్ని నిజంగా చూపిస్తూ పర్మిషన్ ఇయ్యమని అడిగితే ఏదో లోసుగులు చెబుతూ గత నెల రోజుల నుండి పర్మిషన్ ఇవ్వకుండా ఎంతోమందిని ఇబ్బంది పెడుతున్నటువంటి, ఘనత మన కామారెడ్డి టౌన్ ప్లానింగ్ వారి ఉద్ధాంతం మరి ఇదే కామారెడ్డిలో పర్మిషన్ లేకుండా 20 ఫీట్లు జరిగి కట్టాల్సినటువంటి ఇండ్లను ఎన్నో గతంలో ఎన్నోసార్లు పేపర్లలో ప్రకటన వచ్చిన వాటిపై చర్యలు తీసుకోకుండా ఎవరైతే నిజాయితీగా నా జాగా గింత ఉంది పర్మిషన్ ఇవ్వండి అని వస్తే ఇవ్వకుండా ఏవో సాకులు చెబుతూ వెనకకు పంపించినటువంటి ఉద్ధాంతం మున్సిపాలిటీకి రావాల్సి రాబడిని ఇలా కూడా అధికారులు అడ్డుకుంటున్నారా అని కామారెడ్డి ప్రజలు దీనిపై ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు.

Exit mobile version