సచివాలయ సందర్శకులకు QR కోడ్!
హైదరాబాద్‌లోని సచివాలయ సందర్శకులకు ఇకపై ‘విజిటర్ ఈ-పాస్ మేనేజ్‌మెంట్ సిస్టం’ను అమల్లోకి తీసుకురానున్నారు.
దీనికోసం QR కోడ్ ఉన్న విజిటర్ పాస్‌ను రూపొందించారు.
ఈ పాస్‌లో దరఖాస్తుదారు పూర్తి వివరాలు నమోదవుతాయి.
వారు సచివాలయానికి వచ్చిన సమయం నుంచి వెళ్లే వరకు అన్ని వివరాలను నమోదు చేస్తారు.
ఈ-పాస్‌లతో మంత్రులు, పేషీకి ఇచ్చిన దరఖాస్తుల్లో ఎంత శాతం పరిష్కారం అవుతున్నాయో కూడా పర్యవేక్షించవచ్చని సమాచారం.
ఈ నూతన వ్యవస్థ భద్రతతో పాటు పారదర్శకతకు దోహదపడుతుంది.