వంట సరుకులు, వండే పదార్థాలలో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి.

ప్రతిరోజూ గంటన్నర పాటు గణితాన్ని సాధన చేయాలి.

వంట సరుకులు, వండే పదార్థాలలో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి.

జిల్లాలో ఇప్పటివరకు 1,లక్ష 80వేల,463 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు.

రైతు సంక్షేమమే ధ్యేయంగా జిల్లాలో ధాన్యం కొనుగోలు సమర్థవంతంగా అమలు.

పాపన్నపేట మండలంలో విస్తృతంగా పర్యటించి జిల్లా కలెక్టర్ కొత్తపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్, కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన. 

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.

గురువారం, జిల్లాలోని పాపన్నపేట మండలం కొత్తపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ మరియు వెనుకబడిన తరగతుల బాలుర వసతిగృహం, దాన్ని కొనుగోలు కేంద్రాన్ని *జిల్లా కలెక్టర్ సందర్శించి, ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ సందర్భంగా వంట గదిని పరిశీలించి, మెనూ కి సరిపడా వంట సరుకులు ఉన్నాయా మెనూ కి సరిపడా గుడ్లు ఉన్నాయా లెవా అని నిర్వాహకులను అడిగారు. 

ఈ క్రమంలో వారు స్పందిస్తూ.. మెనూ కి సరిపడా వంట సరుకులు ఉన్నాయని, ఉల్లిగడ్డలు పాడవకుండా గాలికి ఆరబెట్టినట్లు నిర్వాహకులు

కలెక్టర్ కు వివరించారు.

వంట సరుకులు, వండే పదార్థాలలో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, శుచికరమైన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలని కలెక్టర్ సూచించారు.అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ మెనూ ప్రకారం ఆహారం పెడుతున్నారా? ఉదయం అల్పాహారం ఎన్ని గంటలకు పెడుతున్నారు? అని అడిగారు.

ఈ నేపథ్యంలో వారు స్పందిస్తూ.. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారని, ఉదయం అల్పాహారం 8:30 గంటలకు పెడుతున్నారని విద్యార్థులు కలెక్టర్ కు వివరించారు.

అదే విధంగా పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడారు. అభ్యాస దీపికను కచ్చితంగా అనుసరించాలని, ప్రతి రోజూ స్టడీ అవర్స్ లో గంటన్నర పాటు తప్పనిసరిగా అభ్యాస దీపికలోని గణిత శాస్త్రాన్ని సాధన చేయాలని, ఈసారి వంద శాతం ఫలితాలు సాధించాలని, 10/10 జీపీఏ రావాలంటే ప్రతి రోజూ బడికి హాజరు కావాలని, విద్యార్థులకు సూచించారు.

అలాగే ప్రత్యేక తరగతిలో వారంలో నాలుగు రోజులు గణితాన్ని సాధన చేయించాలని, ప్రతిరోజూ స్టడీ అవర్స్ లో రెండు సమస్యలను ఇచ్చిపరిష్కరించేలా చూడాలని, పాత ప్రశ్న పత్రాలను సాధన చేయించాలని టీచర్లను ఆదేశించారు.జిల్లాలో 1,80,463 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 250 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందని తెలిపారు.ధాన్యం కొనుగోళ్లలో రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవని కేంద్ర నిర్వాహకులను హెచ్చరించారు. తాలు లేకుండా సరిచూసుకోవాలని, తేదీ, రైతు పేరు, ఫోన్ నంబర్, ధాన్యం కొనుగోళ్ళ పూర్తివివరాలతో రిజిస్టర్లలో సక్రమంగా నమోదు చేయాలని, ధాన్యం కొనుగోలు పూర్తి కాగానే అదే రోజు మిల్లులకు తరలించాలని, తేమ శాతం వచ్చిన వెంటనే ధాన్యాన్ని కాంటా పూర్తి చేసి, ఓ పి ఎం ఎస్ లో నమోదు చేయాలన్నారు .

ఈ కార్యక్రమంలో పాపన్నపేట తాసిల్దార్ సంబంధిత ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహకులు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ వార్డెన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment