క్విట్ ఇండియా ఉద్యమ ఆవిర్భావ దినోత్సవం

ఘనంగా క్విట్ ఇండియా ఉద్యమ ఆవిర్భావ దినోత్సవం:

ప్రశ్న ఆయుధం 10ఆగష్టు
హైదరాబాద్ :

క్విట్ ఇండియా ఉద్యమ ఆవిర్భావ దినోత్సవన్ని పురస్కరించుకొని హైదరాబాద్ లోని గాంధీభవంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సేవాదళ్ అధ్యక్షుడు మిద్దెల జితేందర్ ఆధ్వర్యంలో కార్యక్రమలు నిర్వహించడం జరిగింది. కార్యక్రమాల్లో భాగంగా టిపిసిసి కార్యనిర్వాహక అధ్యక్షులు జగ్గారెడ్డి ముఖ్య అధ్యక్షులుగా పాల్గొని జండా ఆవిష్కరించారు. అదేవిధంగా ర్యాలీని ప్రారంభించడం జరిగింది.గాంధీభవన్ నుంచి ప్రారంభమైన ర్యాలీ గన్ పార్క్ వద్దకు చేరుకొని ఉద్యమంలో అసువులు బాసిన వాళ్ళుకి ఘన నివాళి అర్పించడం జరిగింది, ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ స్టేట్ సేవాదళ్ నాయకులు దయాకర్ మాట్లాడుతూ భారతదేశ స్వతంత్ర ఉద్యమ సంగ్రామంలో ఎంతోమంది కార్యకర్తలు, ఉద్యమకారులను మరియు నాయకులను అందించడం ద్వారా స్వాతంత్ర ఉద్యమానికి ఊపిరి పోయడం వలన మహాత్మా గాంధీ ప్రారంభించిన ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ మరియు కార్యకర్తలు బ్రిటిష్ వారిని భారతదేశం నుండి తరిమి కొట్టడంలో ముఖ్య పాత్రలు పోషించారు అని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేట్ సేవాదళ్ సెక్రటరీ కుదునూరి దయాకర్,జిల్లా సేవాదల్ అధ్యక్షులు కేసు బోయిన నరసింహారావు, అశ్వారావుపేట నియోజకవర్గం సేవాదళ్ నాయకులు బండారు మహేష్, 5 మండలాల అధ్యక్షులు తమ్మిశెట్టి పోసి, ఉలవాలా రాము,శంకర్ వారి అయ్యప్ప,వెంకట రామి రెడ్డి,ఎస్ కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now