నేడు తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్ల కోటా విడుదల..
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. తిరుమల శ్రీవారి దర్శనానికి నవంబర్ నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఇవాళ ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్ ద్వారా విడుదల చేయనుంది. ఇంకా మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదుల కోటాను, సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారి కోటా టికెట్లను టీటీడీ అందుబాటులో ఉంచనుంది.