నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఆర్. గణేష్ గుప్తా

నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఆర్. గణేష్ గుప్తా

రాజేంద్రనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఆర్. గణేష్ గుప్తా 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల జీవితాల్లో సుఖశాంతులు నింపాలని, కొత్త ఆశలు, ఆకాంక్షలతో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టాలని కోరుకుంటున్నానని చెప్పారు.

గణేష్ గుప్తా మాట్లాడుతూ, 2025 సంవత్సరం ప్రతి ఒక్కరికీ శుభాలను, కుటుంబాలలో ఆనందాలను నింపాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. “కొత్త ఏడాది సరికొత్త ఆలోచనలు, ఆశయాలతో ముందుకు సాగాలని, ప్రతి ఒక్కరి జీవితాల్లో మంచి జరగాలని అభిలాషిస్తున్నాను” అని పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని ప్రశంసించారు. “ఈ కొత్త సంవత్సరంలో రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్లాలని, భగవంతుడు ముఖ్యమంత్రికి మరింత శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు.గణేష్ గుప్తా, “రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ నాయకత్వంలో అభివృద్ధి దిశగా ప్రయాణించాలని” ఆకాంక్షించారు.2024లో ఎదురైన అనుభవాలను సానుకూలంగా మల్చుకుని, 2025లో మరింత పట్టుదలతో కృషి చేస్తూ, సవాళ్లను ఎదుర్కొని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

Join WhatsApp

Join Now