పాఠశాలల పనితీరుపై ఆర్ జేడీ ఉషారాణి సమీక్ష
విద్యార్థుల హోజరు, ఎఫ్ఆర్సీ నమోదు, పాఠ్యబోధన పరిశీలన
మధ్యాహ్న భోజనం, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి
భవిత కేంద్రాలు, పీఎం శ్రీ పాఠశాలల సందర్శన
గురువారం విద్యా అధికారులతో సమీక్ష సమావేశం
ప్రశ్న ఆయుధం కామారెడ్డి జిల్లా:
విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు ఎ.ఉషారాణి బుధవారం, గురువారం జిల్లాలో పర్యటించి పాఠశాలల పనితీరును సమీక్షించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు, ముఖ గుర్తింపు (ఎఫ్ఆర్సీ) నమోదు వివరాలు పరిశీలించారు.తరగతి గదుల్లో పాఠ్యబోధన, ఆధునిక పరికరాల వినియోగంపై విద్యార్థులను ప్రశ్నించారు. IFB ప్యానెల్ వినియోగంపై ఆసక్తి వ్యక్తం చేశారు. ప్రారంభ సామర్థ్య పరీక్షల్లో విద్యార్థుల ప్రదర్శనను చూసి మరింత నాణ్యమైన విద్య అందించాల్సిందిగా సూచించారు.ప్రత్యేక అవసరాల పిల్లలపై శ్రద్ధ తీసుకోవాలని, మధ్యాహ్న భోజనం పోషక విలువలతో అందించాలని అధికారులకు సూచించారు. పాఠశాలల పరిశుభ్రత, పచ్చదనం స్థితి, సదుపాయాల వినియోగాన్ని పరిశీలించారు.పీఎం పోషన్ అభియాన్, పీఎం శ్రీ పాఠశాలల్లో అమలవుతున్న కార్యక్రమాలపై సమీక్ష జరిపారు. అటల్ టింకరింగ్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీలు, క్రీడా సామగ్రిపై విద్యార్థులతో మాట్లాడారు.భీక్కనూర్, దోమకొండ, కామారెడ్డి, సదాశివనగర్ ప్రాంతాల్లో భవిత కేంద్రాలు, పీఎం శ్రీ హైస్కూల్స్, కే జీ బీ వి పాఠశాలలను సందర్శించారు. బుధవారం రాత్రి కామారెడ్డి కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులతో రాత్రి గడిపి పరిశీలనలు కొనసాగించారు.గురువారం జిల్లావిద్యాధికారి రాజు సమక్షంలో మండల విద్యా అధికారులతో సమీక్ష నిర్వహించి పాఠశాలల పనితీరును మెరుగుపరిచేందుకు సలహాలు, సూచనలు ఇచ్చారు.