బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆర్.కృష్ణయ్య చిత్రపటానికి పాలాభిషేకం

సంగారెడ్డి ప్రతినిధి, మే 5 (ప్రశ్న ఆయుధం న్యూస్): కేంద్ర ప్రభుత్వం కుల గణన చేపట్టడం చాలా సంతోషదాయకమైన విషయం అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్య నిర్వాహ అధ్యక్షుడు ప్రభుగౌడ్ అన్నారు. సంగారెడ్డి పట్టణంలో సోమవారం రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్య నిర్వాహ అధ్యక్షుడు ప్రభుగౌడ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కుల గణన చేయడం చాలా సంతోషదాయకమైన విషయం అని, ఈ విషయంలో పట్టుబట్టి విజయం సాధించిన రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య, ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.కృష్ణయ్య, జనరల్ సెక్రటరీ గోకుల్ కృష్ణ, జిల్లా అధ్యక్షుడు పట్లోళ్ల మల్లికార్జున పాటిల్, ప్రధాన కార్యదర్శి రాజేశ్వర స్వామి, మహిళా కమిటీ కార్య నిర్వాహ అధ్యక్షురాలు నాగరాణి, జిల్లా కార్యదర్శి మద్దికుంట కొండయ్య, శ్రీనివాస్, సుధాకర్ గౌడ్, యాదగిరి, పాండురంగం, శివశంకర్, రమేష్ బాబు, శివకుమార్, సంగమేశ్వర్, రాజు, రాము, సంతోష్, గౌస్ బాష తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now