ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రసంగం రచ్చ రంబోలా
ఒక మెగా అభిమానిగా చిరు ప్రస్తావన లేకుండా బన్నీ అహం ప్రదర్శించినపుడు బన్నీపై విపరీతమైన కోపం వచ్చింది. రేవంత్ రెడ్డి పై ఈగో ప్రదర్శించినప్పుడు రేవంత్ కి ధీటుగా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మాత్రం బన్నీ తెగ నచ్చేశాడు. తన పేరు పలకకపోవడం తనను సిఎంగా గుర్తించక పోవడం అనే రేవంత్ ఇగో గురించి సినీ ప్రముఖులు ఎవరూ బహిరంగంగా మాట్లాడకపోయినా అది నిజం. ఆనాడు జగన్ నేడు రేవంత్ ఇద్దరూ చేసింది ఒకటే అనేది నా నిశ్చితమైన అభిప్రాయం. అయితే ఇటీవల బన్నీ రేవంత వదంతంపై కర్ర విరగకుండా పాము చావకుండా పవన్ స్పందించారు.అది డిప్యూటీ సిఎం గా ఆ వేదిక కారణం అనుకున్నా. ఈరోజు మాత్రం అటు నటుడు ఇటు డిప్యూటీ సిఎం ప్రత్యేకించి సినీ వేదిక పై ఎవరికి ఇవ్వాల్సింది వారికి ఇచ్చేశాడు.
తన కుటుంబం హీరోలు సినీ ఇండస్ట్రీలో ఉన్నా తను డిప్యూటీ సీఎం అయినా అందుకు కారణం మెగాస్టార్ అనే అభిప్రాయం తన మాటల్లో స్పురించింది. మూలాలు మరవకూడదు అని పరోక్షంగా బన్నీకి ఒక పంచ్ విసిరాడు పవన్. అదే సమయంలో హీరోలు ఎందుకు సిఎంలకు దండం పెట్టాలి అంటూ పరోక్షంగా అటు జగన్ ఇటు రేవంత్ ఇద్దరికీ డబుల్ పంచ్ సూపర్. సినిమాలు తీసే వాళ్ళు మాత్రమే చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడాలి…. సినిమాలు తీయని వాళ్ళు చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడకూడదు ఈ మాట అంబటికి పంచ్ అనుకుంటా. మొదట్లో కుటుంబ సభ్యుడిగా బన్నీ పేరు లేకున్నా తర్వాత నటుడిగా మాత్రం ప్రస్తావించారు. బాబు పై యధావిధిగా ఎలివేషన్ & కృతజ్ఞత వివిధ స్థాయి అధికారులను గుర్తించడం విశేషం.
టికెట్టు ధరలు ఇప్పుడు పంపు కొత్త కాదు ఇప్పుడు మాత్రమే వివాదం ఎందుకు? కొనేవారికి లేని బాధ ఇతరులకి ఎందుకు? అది నిత్యవసర వస్తువు కాదు పైగా రోజులు మారాకొద్దీ ధరలు మారుతూనే ఉన్నాయి. ఆత్రం ఆపుకుంటే సాధారణ జరగక కూడా చూడొచ్చు. ధరలు పెంపు విషయంలో డిమాండ్ సప్లై అనే సూత్రం 100% నిజం. మొత్తంగా పవన్ కళ్యాణ్ లో ఎక్కడ ఎలా మాట్లాడాలి అనే మెచ్యూరిటీ ఒక లెవెల్ కి చేరింది.
ఇక ఈవెంట్ గురించి చెప్పాలి అంటే సంక్రాంతి సినిమాల్రో ప్రస్తుతం సంక్రాంతికి వస్తున్నాం మాత్రమే ప్రచారం లో ముందుంది. ఈరోజు గేమ్ ఛేంజర్ కి కావలసిన బజ్ వచ్చేసింది. చరణ్ తన బాబాయ్‌ని డిప్యూటీ సిఎం అని పిలవడం.. అదో మెగా ఫీల్. బాబాయ్ అబ్బాయ్ అంటే పవన్ చరణ్ లా ఉండాలి.