స్వీయ ప్రేరణ -లక్ష నిర్దేశానికి బాసట: ప్రముఖ మోటివేషనల్ ట్రైనర్ రాచకొండ చంద్రశేఖర్
నిజామాబాద్ (ప్రశ్న ఆయుధం ) జిల్లా ప్రతినిధి డిసెంబర్ 28
శనివారం స్థానిక గంగస్థాన్ నందుగల బ్లూమింగ్ బడ్స్ పాఠశాలలో 9, 10వ తరగతి విద్యార్థుల కై రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో విద్యా, ప్రేరణ శిక్షణ సెమినార్ ను ఏర్పాటు చేసినట్లు క్లబ్ అధ్యక్షులు బిరెల్లి విజయరావు తెలిపారు. ఇట్టి కార్యక్రమానికి వక్తగా ప్రముఖ నిరూపమ్స్ ఫ్యూచర్ మైండ్స్ డైరెక్టర్ మోటివేషనల్ వక్త Tr. రాచకొండ చంద్రశేఖర్ హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ నేడు వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో విద్యార్థులకు జీవన నైపుణ్యాలు, ప్రాముఖ్యత చాలా అవసరం. అకాడమిక్ విజయాలు విద్యార్థికి బలమైన పునాదిని అందజేస్తుందని, విద్యార్థి దశలోనే సమస్య- పరిష్కారం, స్వీయ – ప్రేరణ వంటి ముఖ్యమైన జీవిత నైపుణ్యాలు అధికారిక విద్యకు మించిన విజయానికి సమానంగా కీలకం. ఈ సామర్ధ్యాలు విద్యార్థులను వారి భవిష్యత్తు వృత్తిపరమైన వృత్తికి సిద్ధం చేయడానికి కాకుండా ఎప్పటికప్పుడు మారుతున్న సామాజిక ప్రకృతి దృశ్యంలో వారి వ్యక్తిగత అభివృద్ధికి మరియు అనుకూలతకు దోహదం చేస్తాయన్నారు. .సమస్య – పరిష్కార నైపుణ్యాలు కొన్ని సమస్యలను గుర్తించి వాటి మూల్యాంకనం చేయడం ద్వారా అత్యంత అనుకూలమైన పరిష్కారంగా విద్యార్థికి ప్రోత్సాహం అందిస్తుంది. ఈ రకంగా వీరికి స్వీయ ప్రేరణ మరియు లక్ష నిర్దేశన అంశాలపై సూచనలు ఇస్తూ విద్యార్థులచే రానున్న 10వ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులతో విజయాన్ని సాధిస్తామని తీర్మానం కూడా చేయించుకోవడం జరిగినది. అనంతరం విద్యార్థులతో మమేకమై వారి ప్రశ్నలకు పరిష్కారాలు కూడా ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో క్లబ్ సభ్యులు కార్యదర్శి గంగారెడ్డి, తులసీదాస్పటల్, రాజ్ కుమార్ సుబేదార్, రామకృష్ణ, బాబురావు పాఠశాల ఇంటరాక్టివ్ క్లబ్ కార్యవర్గ సభ్యులు, పాఠశాల హెచ్ఎం రవికుమార్, మరియు సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు.