*రాచకొండ పోలీసుల మెరుపు నాకాబంధీ: అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదం!*
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రశ్న ఆయుధం జులై 18
రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు, ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈరోజు రాచకొండ కమిషనరేట్ పరిధిలోని 42 ప్రాంతాల్లో భారీ నాకాబంధీ (వాహనాల తనిఖీ) కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు వర్ష ప్రభావం లేని ప్రాంతాల్లో ఈ తనిఖీలు కొనసాగాయి.
ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం ప్రశాంతంగా సాగిందని అధికారులు తెలిపారు. నిషేధిత వస్తువులు, అక్రమ మారణాయుధాలు, మరియు అక్రమ వాహనాల తరలింపును అరికట్టడమే ఈ నాకాబంధీ ముఖ్య ఉద్దేశ్యమని పోలీసులు స్పష్టం చేశారు.
ప్రజల పూర్తి సహకారంతో తనిఖీలు విజయవంతంగా పూర్తయ్యాయని రాచకొండ పోలీస్ శాఖ పేర్కొంది. భద్రతా దృష్ట్యా, రాబోయే రోజుల్లో ఇటువంటి తనిఖీలు మరింత కట్టుదిట్టంగా కొనసాగుతాయని అధికారులు తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించి, శాంతిభద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు.