పరిశుభ్రత తోనే డెంగ్యూను అరికట్టవచ్చు: రాగం నాగేందర్ యాదవ్
ప్రశ్న ఆయుధం మే16: శేరిలింగంపల్లి ప్రతినిధి
ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్. జాతీయ డెంగ్యూ జాతి నివారణ దినోత్సవంలో భాగంగా శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన ర్యాలీని శేరిలింగంపల్లి జోనల్ కమీషనర్ హేమంత్ బోర్కడే తో కలిసి శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ జెండా ఊపి ప్రారంభించారు. డెంగ్యూ నివారణలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఇంట్లో, పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ లేకుండా చూడాలని సూచించారు. డెంగ్యూపై ప్రతిరోజు ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు అవగాహన కల్పించాలని, ఆశా వర్కర్లు ఆరోగ్య సిబ్బందికి అవగాహన కల్పించడం తప్పనిసరి అన్నారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డెంగ్యూ కిట్లు అందుబాటులో ఉంచామని ఎలిజా పరీక్ష ద్వారా డెంగ్యూని పూర్తిగా నిర్ధారించేందుకు సదుపాయాలు ఉన్నాయని తెలిపారు. ప్రతి శుక్రవారం డ్రై డే గా పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏంటమోలజీ ఎస్సీ వెంకటమనికరణ్, ఎఈ తనూజ, సీనియర్ నాయకులు పురం విష్ణువర్ధన్ రెడ్డి, రవి, గోపినగర్ బస్తీ అధ్యక్షులు గోపాల్ యాదవ్, ఏంటమోలజీ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు.