జోనల్ కమీషనర్, డిప్యూటీ కమీషనర్ లను మర్యాదపూర్వకంగా కలిసిన రాగం నాగేందర్ యాదవ్
ప్రశ్న ఆయుధం మే06: శేరిలింగంపల్లి ప్రతినిధి
శేరిలింగంపల్లి జోనల్ కమీషనర్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన హేమంత్ భోర్ఖడే ఐఏఎస్ ని, డిప్యూటీ కమీషనర్ వి ప్రశాంతి ఎల్ ఎల్ బీ,ఎమ్ బీ ఏ. ని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి, పూలబొకే బహుకరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, శేరిలింగంపల్లి డివిజన్ లో నెలకొన్న పలు సమస్యలను, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై జోనల్ కమీషనర్ తో చర్చించామని, అసంపూర్తిగా మిగిలిపోయిన అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లుగా తెలిపారు.