ర్యాగింగ్ చేయడం చట్టరీత్య నేరం.

*గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకోవద్దు*

_*ర్యాగింగ్ చేయడం చట్టరీత్య నేరం.*_

_*సైబర్ నేరాల పట్ల అప్రమత్తత అవసరం*_

:కొడంగల్ నియోజకవర్గం*కోస్గి మండల కేంద్రంలో గల ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలో మాదకద్రవ్యాల దుర్వినియోగం, సైబర్ క్రైమ్ మరియు ర్యాగింగ్ లపై విద్యార్థిని విద్యార్థులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు కు ముఖ్య అతిథిగా నారాయణపేట జిల్లా ఎస్పీ గౌతమ్, ట్రైనీ కలెక్టర్ గరిమ నరుల పాల్గొన్నారు.

విద్యార్థులు తమ జీవితంలో ఉన్నత లక్ష్యాలను ఈ విధంగా సాధించాలని ఈ సందర్భంగా అధికారులు తమ జీవితంలో సక్సెస్ అవ్వడానికి స్కూలు కళాశాల నుండి, పోటీ పరీక్షలకు ఏ విధంగా చదివారు,చదివిన విధానం ఉన్నత లక్ష్యానికి చేరడానికి పడ్డ కష్టాన్ని, కష్టపడే తత్వాన్ని, జీవితంలో సక్సెస్ అయిన విధానాన్ని వారి యొక్క జీవిత పాఠాలను విద్యార్థులకు వివరించారు_.

అనంతరం ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ_…

_విద్యార్థిని, విద్యార్థులు ర్యాగింగ్, గంజాయి, డ్రగ్స్ లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ ఉత్తమ ఇంజనీర్లుగా ఎదిగి జిల్లాకు మంచి పేరు తీసుకరావలన్నారు_.

_గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలాంటి వ్యసనాలకు బానిసై విద్యార్థులు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, మాదకద్రవ్యాలు సమూలంగా నిర్మూలించుటలో యువత పోలీసులకు సహకరించాలని తెలిపారు_.

_మాదకద్రవ్యాలకు అలవాటు పడడం వలన క్రమేపి ఆరోగ్యం క్షీణించడంతో పాటు అది ఒక వ్యసనంగా మారుతుందని, నేర ప్రవృత్తి వైపు దారి తీస్తుందన్న విషయం గమనించాలని పేర్కొన్నారు_.

_కావున దానిని ఆది నుంచి తొలగించాలని కోరారు.విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు మీ పై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు_.  

_సైబర్ క్రైమ్_:

_నేటి సమాజంలో సాంకేతికత పెరుగుదలతో పాటు సైబర్ నేరాలు విపరీతంగా పెరిగాయని వాటీ పట్ల తగు జాగ్రత్తలు పాటించాలని, వీటిపై ప్రతి ఒక్క విద్యార్థికి అవగాహన కలిగి ఉండాలని సూచించారు_.

_అనవసరమైన లింకులు ఓపెన్ చేయరాదని, ఓటిపిలు ఇతరులకు తెలపరాదని, సైబర్ నేరగాళ్లు చూపే మోసపూరిత ఆశలకు గురికాకుండా తగు జాగ్రత్తలు పాటించాలని ఒకవేళ నేరానికి గురి అయితే 1930 టోల్ ఫ్రీ నెంబర్ కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ తెలిపారు_. 

_ర్యాగింగ్: విద్యాసంస్థల్లో యాంటీ ర్యాగింగ్ కమిటీలు ఏర్పాటు చేసి ర్యాగింగ్ మొదటి దశలోనే కట్టడి చేయాలని,కలశాల యాజమాన్యాలు విద్యార్థుల అలవాట్లను,నడవడికను ఎప్పటికప్పుడు గమనించాలని తెలిపినారు_. 

_విద్యార్థులు ర్యాగింగ్ చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని,తోటి విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించడం,వారిని ఇబ్బందులకు గురి చేయడం మంచి విద్యార్ధి లక్షణం కాదు అని తెలిపినారు_.

_విద్యార్థులు సీనియర్స్, జూనియర్స్ అనేది లేకుండా స్నేహపూర్వకంగా కలిసి మెలిసి విద్యనభ్యసించి ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలని సూచించారు_. 

_ర్యాగింగ్ చేయడం నేరమని,ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు_.

_ర్యాగింగ్ కు పాల్పడే వారి వివరాలను కళాశాల యజమాన్యానికి లేదా సంబంధిత పోలీసులకు లేదా డయల్ 100 కు తెలియజేసి సమాచారం అందించాలన్నారు_. 

_ముఖ్యంగా మహిళలు, అమ్మాయిల పై నేరాలు జరగకుండా ఉండాలంటే విద్యార్థినిలు మౌనం విడి ముందుకు వచ్చి సమస్యలు పరిష్కరించుకోవాలని, నిర్భయంగా ముందుకు వచ్చి మీ సమస్యలను చెప్పుకున్నాప్పుడే మరింత భద్రత కల్పించగలువుతామని, మహిళలు,విద్యార్థినిలు జిల్లా “షీ” టీమ్ కు పిర్యాదు చేసినచో చట్టపరమైన చర్యాలు తీసుకోవడం జరుగుతుంది అని అన్నారు.పిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని అన్నారు_. 

_ఈ సమావేశంలో కోస్గి సీఐ దస్రు నాయక్, కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు, ఎంఈఓ శంకర్ నాయక్, ఎం పి డి ఓ శ్రీధర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీనివాస్, ఎస్సై బాల్ రాజ్, లెక్చరర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు_.

Join WhatsApp

Join Now

Leave a Comment