Site icon PRASHNA AYUDHAM

అక్రమాలపై ఆధారాలతోనే వార్తలు రాయాలి: ఎంపీ రఘునందన్ రావు

IMG 20250826 WA1355

*డిజిటల్ మీడియా ప్రజలకు చేరువైంది.*

*అక్రమ అరెస్టులు చేస్తే న్యాయపోరాటం చేస్తాం.*

హైదరాబాద్, ఆగస్టు 26: డిజిటల్ మీడియా సమాజానికి మరింత దగ్గరగా ఉందని, జర్నలిజం నైతిక విలువలను కాపాడుకోవడంలో ప్రతి పాత్రికేయుడు కీలక పాత్ర పోషించాలని ఎంపీ రఘునందన్ రావు పిలుపునిచ్చారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన డిజిటల్ మీడియా రక్షణ చట్టాలపై అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అక్రమాలపై ఆధారాలు లేకుండా రాసే వార్తలు ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తాయని, జర్నలిస్టులు నిజానిజాలు నిర్ధారించుకొని, ఆధారాలతోనే వార్తలు అందించాలని సూచించారు. ప్రజల సమస్యలను వెలుగులోకి తేవడమే కాకుండా, సమాజంలో పారదర్శకతను పెంచడం జర్నలిస్టుల ధర్మమని అన్నారు. అక్రమ అరెస్టులు చేస్తే మేము న్యాయ పోరాటానికి దిగుతామని, పత్రికా స్వేచ్ఛను ఎవరూ అణగదొక్కలేరని తెలిపారు. జర్నలిస్టుల భద్రతకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. జర్నలిస్టులు మంచి భాష వాడాలని, వ్యక్తిగత దూషణలు చేయకుండా వాస్తవాలను ప్రామాణికంగా రాయడం ద్వారా సమాజంలో విశ్వాసం పెంపొందుతుందని ఆయన పేర్కొన్నారు. డిజిటల్ మీడియా వేగంగా అభివృద్ధి చెందుతోందని, ప్రతి వార్తలో బాధ్యతాయుత ధోరణి ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాదరావు మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థాయిలో ఉండి జర్నలిస్టులను అవమానించేలా బట్టలూడదీస్తా అని మాట్లాడడం చాలా దారుణం అని, మరొకసారి ఇలాంటి మాటలు వస్తే న్యాయ పోరాటానికి సిద్ధమవుతామని తీవ్రంగా హెచ్చరించారు. “ప్రజాస్వామ్యంలో నాలుగో స్థంభమైన పాత్రికేయులను కించపరిచే వ్యాఖ్యలు చేయడం అనాగరికం అని, జర్నలిస్టుల హక్కుల కోసం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని చెప్పారు. డిజిటల్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్ కమిటీ ఆవిర్భావ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అధ్యక్షులుగా నిర్మల, హిట్ టీవీ ప్రధాన కార్యదర్శిగా మహేష్ తో పాటు పలువురిని ఎన్నుకున్నారు.ఈ అవగాహన సదస్సులో పలువురు జర్నలిస్టులు పాల్గొని డిజిటల్ మీడియా చట్టపరమైన రక్షణ, భవిష్యత్ సవాళ్లపై చర్చించారు.ఈ కార్యక్రమంలో ఐఎఫ్ డబ్ల్యూజే జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ పెద్దపురం నరసింహ, సెక్రటరీ డాక్టర్ భరత్ కుమార్ శర్మ, టీజేయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగి స్వామి, వైస్ ప్రెసిడెంట్ దాసన్న, రాష్ట్ర కార్యదర్శి బాపురావు, సిహెచ్. శ్రీనివాస్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు రామకృష్ణ, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు ఎల్లయ్య, మేడ్చల్ మల్కాజిగిరి అధ్యక్షుడు శ్రీనివాస్, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు అశోక్, సిద్దిపేట జిల్లా జనరల్ సెక్రటరీ మరాటి కృష్ణమూర్తి మహేష్, సిద్దగౌడ్, రచన,వసంత్, అభినవ్ గంగాధర్ అజిత్వివిధ జిల్లా జర్నలిస్టులతో పాటు నూతన కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Exit mobile version