Headlines :
-
తెలంగాణ విలువను పెంచింది కేసీఆరే – రఘురామకృష్ణంరాజు ప్రశంసలు
-
మూసీ ప్రాజెక్టుకు భారీ ఖర్చు – రఘురామకృష్ణంరాజు అభిప్రాయాలు
-
హైడ్రా ఇండ్లు కూల్చివేత అన్యాయం – రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలు
-
తెలంగాణలో భూముల ధరలు పెరిగి సకల అభివృద్ధి – కేసీఆర్ పాలన ఫలితాలు
-
తెలంగాణ బడ్జెట్‌పై ప్రశ్నల వర్షం – మూసీ ప్రాజెక్టు ఖర్చులపై అనుమానాలు
కేసీఆర్ అంటే ఇష్టం.. ఆయన పాలన బాగుండేది
పదేండ్లలో రాష్ట్రం విలువను పదిరెట్లు పెంచి చూపారు
పర్మిషన్లున్నా హైడ్రా ఇండ్లు కూల్చివేయడం అన్యాయం
బడ్జెట్ 3 లక్షల కోట్లుంటే..
మూసీకి లక్షన్నర కోట్లా..?
టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలు
హైదరాబాద్, వ్యక్తిగతంగా కేసీఆర్ అంటే చాలా ఇష్టం. ఆయనను కలిసింది రెండు, మూడుసార్లు మాత్రమే. ఆయన పాలన బాగుండేది. కేసీఆర్ పదేండ్లలో తెలంగాణ విలువను పది రెట్లు పెంచి చూపించారు’ అని టీడీపీకి చెందిన ఆంధ్రప్రదేశ్‌లోని ఉండి 5వ పేజీలో
నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన ఒక చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కామెంట్స్ చేశారు. ఉదాహరణకు కరీంనగర్‌లో రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు ఉండే ఎకరం ధర కేసీఆర్ హయాంలో రూ.70 లక్షలకు పెరిగిందని చెప్పారు. హైదరాబాద్, దాని చుట్టుపక్కల కూడా భూముల విలువ బాగా పెరిగిందని వివరించారు. హైడ్రా కూల్చివేతల విషయంపై స్పందిస్తూ.. ‘ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వమే అన్ని పర్మిషన్లు ఇచ్చిన నివాసాలను కూల్చివేయడం చూస్తుంటే మనస్తాపానికి గురిచేస్తున్నది. అది ఎంతమాత్రం న్యాయం కాదు’ అని పేర్కొన్నారు. మూసీ ప్రాజెక్టు పునర్జీవంపై మాట్లాడుతూ.. తెలంగాణ బడ్జెట్ రూ.మూడు లక్షల కోట్లు ఉంటే, మూసీకి రూ.1.54 లక్షల కోట్లు ఖర్చుచేయడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు.