సంగారెడ్డి, నవంబరు 19 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి పట్టణానికి చెందిన శ్లోకాస్ శ్రీవాణి హై స్కూల్ లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి మహమ్మద్ అబ్దుర్ రహమాన్ సిద్దిఖ్ పెద్దపల్లి జిల్లా సెంచ్నరీ కాలనీ, రాణి రుద్రమదేవి స్టేడియం స్విమ్మింగ్ పూల్ లో నిర్వహించిన 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర స్థాయి ఈతల పోటీలో మూడో స్థానంలో నిలిచి వివిధ స్టాక్ లో రెండు రజత పతకాలు సాధించిచాడు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాసరావు మహమ్మద్ అబ్దుర్ రెహమాన్ ను అభినందించారు. ఇలాంటి పోటీల్లో రాష్ట్ర దేశస్థాయిలో మరింత ప్రతిభ కనబరిచి మంచి పేరు గడించాలని ఆశిస్తున్నానని తెలిపారు. సంగారెడ్డి జిల్లా ఎస్ జీఎఫ్ స్విమ్మింగ్ పోటీలలో అత్యధిక పథకాలను సాధించినందుకు జిల్లా ఇన్చార్జ్ శేషు కుమార్ కు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాస్ రావు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. స్విమ్మింగ్ కోచ్, సంగారెడ్డి జిల్లా సిమ్మింగ్ ఇంచార్జ్ శేషు కుమార్ మాట్లాడుతూ.. అబ్దుర్ రెహమాన్ అండర్ 14 లో బ్రెస్ట్ స్టాక్ 100 మీటర్స్, ఇండివిజువల్ మెడ్లి 200 మీటర్స్ లో రెండు రజత పథకాలను సాధించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. డీవైఎస్ఓ ఖాసిం బేగ్ సంతోషం వ్యక్తం చేస్తూ మునుముందు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. డీఎస్ ఏ సిబ్బంది అభినవ్, దీపిక, పవన్ కళ్యాణ్ స్విమ్మింగ్ పూల్ సిబ్బంది పవన్, కృష్ణ, కుమార్ రెహమాన్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.
రాష్ట్ర ఈత పోటీల్లో రెహమాన్ అద్భుత ప్రతిభ
Updated On: November 19, 2025 9:03 pm