కాంగ్రెస్ ధర్నాకు రాష్ట్రపతి స్పందిస్తారని ఆశిస్తున్నా: రాహుల్‌గాంధీ
Aug 06, 2025,
కాంగ్రెస్ ధర్నాకు రాష్ట్రపతి స్పందిస్తారని ఆశిస్తున్నా: రాహుల్‌గాంధీ
కులగణన ఆధారంగా సామాజిక న్యాయం కోరుతున్నామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ సంయుక్తంగా నిర్వహించిన బీసీ మహాధర్నాపై ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ‘కాంగ్రెస్ చేపట్టిన మహాధర్నాకు రాష్ట్రపతి స్పందిస్తారని నమ్ముతున్నా. బీసీ బిల్లుకు ఆమోదం లభిస్తే, అది సామాజిక న్యాయానికి కీలకమైన ముందడుగు అవుతుంది. ఈ ఉద్యమం కేవలం తెలంగాణకే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న అణగారిన వర్గాల హక్కుల కోసం’ అంటూ పేర్కొన్నారు.