రాహుల్ గాంధీ తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలి.
నిజామాబాదు(ప్రశ్న ఆయుధం ఆగస్టు31)
రాహుల్ గాంధీ తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోళ్ళ లక్ష్మి నారాయణ డిమాండ్ చేశారు. అనంతరం ఇందూరు జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్, శివాజీ చౌక్ వద్ద రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
ఈ సందర్భంగా జిల్ల ప్రధాన కార్యదర్శి నాగోళ్ళ లక్ష్మి నారాయణ మాట్లాడుతూ భారతదేశంలో ప్రజాస్వామ్యం లేదని, ఎన్నికలు సరిగ్గా జరగలేదని అమెరికాలో రాహుల్ గాంధీ భారతదేశ ప్రతిష్టను దెబ్బతీశారని ఆయన ఆరోపించారు. దేశంలో ప్రజలు మద్దతు ఇవ్వకుండా రాహుల్ గాంధీని తిరస్కరిస్తే ఏదో కోల్పోయినట్లు రాహుల్ గాంధీ దేశం పట్ల విష ప్రచారం చేస్తున్నారని లక్ష్మి నారాయణ ఘాటుగా స్పందించారు. రాహుల్ గాంధీ తక్షణమే భారతీయులకు క్షమాపణ చెప్పాలని లక్ష్మి నారాయణ స్పష్టం చేశారు. భారతీయ సంస్కృతిలో స్త్రీని గృహలక్ష్మిగా, మాతృదేవోభవ అని పూజిస్తారు. అటువంటి ఆడవారి గౌరవాన్ని కించపరచడం దేశ ప్రజల భావజాలానికి అవమానమని ఆగ్రహం వ్యక్తం చేశారు, ఆడవారిని తక్కువ చేసి మాట్లాడే వాడికి సమాజంలో స్థానం ఉండకూడదని, రాజకీయ నేతగా ఉన్న రాహుల్ గాంధీ కనీస మర్యాదలు పాటించకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. కార్యక్రమంలో ఇందూరు జిల్లా భారతీయ జనతా పార్టీ నాయకులు న్యాలం రాజు, మండల అధ్యక్షులు, గడ్డం రాజు, ఇప్పకాయల కిషోర్, నాగరాజు, తారక్ వేణు, ఆనంద్ రావు,తాజా మాజీ కార్పొరేటర్ వెల్డింగ్ నారాయణ, బీజేపీ నాయకులు విరేందర్, మఠం పవన్, బట్టి కిరి ఆనంద్, పవన్ ముందడ,హరీష్ రెడ్డి, భాస్కర్, కిరణ్ కస్తూరి కృష్ణ, టీంకుల్ గౌడ్,బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.