ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

*ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు*

*జమ్మికుంట ఇల్లందకుంట జూన్ 19 ప్రశ్న ఆయుధం*

ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలకు అపర భద్రాద్రి ఇల్లందకుంట శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ ప్రాంగణంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు గురువారం రోజున ఇల్లందకుంట మండల కేంద్రంలో హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ ఒడితల ప్రణవ్ బాబు ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెద్ది కుమార్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో ప్రత్యేకమైన పూజలు అర్చనలు అభిషేకం నిర్వహించి అనంతరం మండల కేంద్రంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం మండల పార్టీ అధ్యక్షుడు పెద్ది కుమార్ మాట్లాడుతూ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పెన్నిధి రాయ్ బరేలి ఎంపి కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పోరాటం చేస్తూ వారి హక్కులను వారి స్వేచ్ఛ కోసం దేశంలోని సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి భారత్ జోడో న్యాయ యాత్ర లో భాగంగా దేశం మొత్తం కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను స్వయంగా తానే విని వాటి పరిష్కారం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నాడని కాంగ్రెస్ పార్టీ కీర్తిని ముందుకు తీసుకువెళ్లి పార్టీకి దేశానికి ఎనలేని సేవలు చేస్తున్నాడని రానున్న కాలంలో రాహుల్ గాంధీ ని దేశ ప్రధానిగా చూడబోతున్నామని పేర్కొన్నారు రాహుల్ గాంధీ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని వారు ప్రధాని అయ్యి భారతదేశానికి మరెన్నో సేవలు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సీతారామచంద్రస్వామి దేవస్థానం చైర్మన్ ఇంగిలే రామారావు కనుమల్ల సంపత్ గూడెపు సారంగపాణి కనుమల్ల రామకృష్ణ వంగ రామకృష్ణ మారేపల్లి ప్రశాంత్ గంగారం మహేష్ గూడెపు ఓదెలు దేవస్థానం ధర్మకర్తలు మూడెత్తుల మల్లేష్ గొడిశాల పరమేశ్వర్ ఎడ్ల కిషన్ రెడ్డి గ్రామ శాఖ అధ్యక్షులు మేడద తిరుపతిరెడ్డి గోరుకుంట్ల స్వామి మరి వీరారెడ్డి భోగం సాయిరాం బండి మల్లయ్య మిట్ట మోహన్ రెడ్డి మూడెడ్ల రమేష్ తోడేటి కిషన్ కొండాల్ రెడ్డి బుర్ర రమేష్ రావుల రాజబాబు ఆరే రమేష్ రెడ్డి జక్కు కుమారస్వామి తాడెం దిలీప్ మారేపల్లి రమేష్ మారేపల్లి వంశీ పెద్ది అభిలాష్ గంధం రవీందర్ మంకు ఐలయ్య రెడ్డి సారంగం డిష్ రాజు గట్టి శేఖర్ ఉప్పుల ఆయిల్ రెడ్డి ఉప్పుల మల్లారెడ్డి దాసరి తిరుపతిరెడ్డి లింగారావు వేముల ప్రవీణ్ బుద్ధార్థి ప్రశాంత్ జిల్లెల్ల జలంధర్ రెడ్డి సరిగుమ్ముల సాగర్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment